తల్లిని థియేటర్లోకి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేసిన నటి రాజేశ్వరి!

తెరపై కనిపించాలని, తెరపై నటించాలని చాలా మందికే ఉంటుంది. కానీ ఆ అవకాశం అందరికీ ఉండదు. కానీ ఇక్కడ ఓ తల్లికి తన కూతుర్ని తెరపై చూడాలనేది కల. తన కూతురు ఏదోలా ఏదో ఒక పాత్రలో అలా తెరపై కనిపించాలని, తన కూతురు తెరపై ఎంతో అందంగా ఉంటుందని ఆ తల్లి భావించేదట. అందుకే తల్లి కలను కూతురు నెరవేర్చింది. సినిమా అవకాశం వచ్చినా కూడా ఇంట్లో తల్లికి చెప్పకుండా.. సైలెంట్‌గా సినిమాను పూర్తి చేసి.. డైరెక్ట్‌గా థియేటర్లోనే చూపించి సర్ ప్రైజ్ ఇచ్చిందట. ప్రస్తుతం ఆ తల్లి ఆనందభాష్పాలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

బిగ్ బాస్ టీంలో క్రియేటివ్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటుంది రాజేశ్వరి ప్రసాద్. కింగ్ నాగ్, బిగ్ బాస్ కంటెస్టెంట్లతో దిగిన ఫోటోలను రాజేశ్వర్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఉస్తాద్ సినిమా గురించి పోస్ట్ వేసింది. శ్రీ సింహా నటించిన ఉస్తాద్ సినిమా శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎయిర్ హోస్టెస్‌గా రాజేశ్వరి ప్రసాద్ కనిపించింది. ఈ మేరకు తన డెబ్యూ గురించి చెబుతూ పోస్ట్ వేసింది.

ఈ రోజు (ఆగస్ట్ 12) వరకు ఈ విషయాన్ని నేను ఎంతో సీక్రెట్‌గా ఉంచాను.. కొన్ని కలలు నిజం అవుతుంటాయి.. కొన్ని సార్లు మనం కల కనడానికి కూడా సాహసించం.. కానీ సరైన టైం వస్తే ఆ కలలు కూడా నిజం అవుతాయ్.. అదే విధి అని కూడా అంటుంటారు.. ఇప్పుడు ఉస్తాద్ విషయంలోనూ నాకు జరిగింది అదే.. గౌతమ్ మీనన్ సర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను.. నేను ఇది ఎప్పుడూ కలగనని కల.. ఎప్పుడూ అనుకోనిది.. అంటూ సంబరపడుతున్నట్టుగా పోస్ట్ వేసింది.

మా అమ్మ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది.. మా అమ్మ నన్ను ఎప్పుడైనా ఒకసారైనా సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని కలలు కంటూ ఉండేది.. నేను సిల్వర్ స్క్రీన్ మీద బాగుంటానని మా అమ్మ నమ్మకం.. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా.. ఉస్తాద్ మూవీ ఆఫర్ వచ్చిన తరువాత నేను ఎవ్వరికీ చెప్పలేదు.. మా అమ్మను ఇలా సర్ ప్రైజ్ చేద్దామని అనుకున్నాను.. మా అమ్మ ఆనందాన్ని, సంతోషాన్ని ఇలా క్యాప్చర్ చేశాను.. అంటూ తన సంతోషాన్ని, తన అమ్మ ఆనందం గురించి ఇలా వీడియోను షేర్ చేసి చూపించింది.శశివదనే నిర్మాత అహితేజ రాజేశ్వరీ ప్రసాద్‌కు కంగ్రాట్స్ చెబుతూ.. తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఉస్తాద్ సినిమాను ఎప్పుడెప్పుడూ చూస్తానా? అని ఆత్రుతగా ఉందంటూ పోస్ట్ వేశాడు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus