Rajinikanth: రూ.600 కోట్ల బ్లాక్ బస్టర్ ఎఫెక్ట్.. తలైవాకి గిఫ్ట్ గా ఖరీదైన కార్!

రజనీ కాంత్ హీరోగా రూపొందిన ‘జైలర్’ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘డాక్టర్’ ‘బీస్ట్’ వంటి చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 10 న రిలీజ్ అయ్యి మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ గా టాక్ ను సొంతం చేసుకుంది. తమన్నా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా.. రజనీకాంత్ కి జోడీగా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమా ఇప్పటివరకు రూ.600 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తమిళంలో ‘విక్రమ్’ ‘పొన్నియన్ సెల్వన్’ వంటి చిత్రాల కలెక్షన్లను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘జైలర్’ సినిమా..! రజనీకాంత్ ను అభిమానులు ఎలా చూడాలనుకున్నారో.. అలా చూపించి.. వారి ప్రశంసలు అందుకున్నారు దర్శకులు నెల్సన్. ఇదిలా ఉండగా.. ‘జైలర్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో నిర్మాత కళానిథిమారన్.. రజనీ కాంత్ కు ఓ ఖరీదైన కారుని గిఫ్ట్ గా అందించినట్టు తెలుస్తుంది. బి.ఎం.డబ్ల్యు ఎక్స్ 7 కారుని కళానిథిమారన్.. (Rajinikanth)  రజనీకాంత్ కి బహుకరించినట్టు సమాచారం.

దీని ధర అక్షరాలా రూ.1.23 కోట్లు అని తెలుస్తుంది. కళానిథిమారన్ కి గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేదు. ఇక రజనీకాంత్ కూడా ఓ సక్సెస్ అందుకుని 6 ఏళ్ళు పైనే అయ్యింది. రజనీకాంత్ సినిమా కనుక హిట్ అయితే అది ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుంది అనడానికి ‘జైలర్’ ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus