“కబాలి” డిజాస్టర్ అనంతరం మళ్ళీ అదే డైరెక్టర్ తో రాజనీకాంత్ చేస్తున్న సినిమా “కాలా. ఎప్పట్లానే తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకానున్న ఈ చిత్రంపై టీజర్ భారీ క్రేజ్ తీసుకొచ్చింది. అయితే.. “కబాలి” వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు “కాలా” హక్కులు తమకే ఇవ్వాలని అది కూడా “కబాలి” కంటే తక్కువ రేటుకు ఇవ్వాలని కోరారు. ఈ విషయమై కాస్త గట్టి చర్చలే జరిగాయి. మొత్తానికి రజనీకాంత్ ఇన్వాల్వ్ అయ్యి గొడవను సెటిల్ చేశాడు. ఏప్రిల్ 27న సినిమా విడుదల చేద్దామనుకొన్నారు.
అయితే.. టీజర్ రిలీజ్ తర్వాత సినిమా యూనిట్ నుంచి మరో అప్డేట్ లేకపోవడంతో సినిమా నిజంగానే ముందు ప్రకటించినప్రకారం ఏప్రిల్ 27న విడుదలవుతుందా లేక వాయిదా పడుతుందా అనే అనుమానాలు రేగాయి. అయితే.. ఈ విషయమై నిన్న నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా స్పందించింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం లేదని చెప్పడంతోపాటు క్లారిటీ వచ్చింది. అయితే.. ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లోనే కాక ఇండస్ట్రీ వర్గాల్లోనూ అనుమానాలు నెలకొని ఉన్నాయి. అందుకు కారణం రజనీ మునుపటి చిత్ర దర్శకుడు పా.రంజిత్ “కాలా” చిత్రానికి దర్శకత్వం వహించడమే.