Rajinikanth: రజనీకాంత్ తరహా పాత్రలను ఎంచుకోవడం టాలీవుడ్ హీరోలకు సాధ్యమా?

రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జైలర్ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తోంది. రజనీకాంత్ సినిమాకు ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వస్తుండటం, సాధారణ సినిమాతో రజనీకాంత్ అసాధారణ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే తాత క్యారెక్టర్ లో మందపాటి కళ్లద్దాలతో నటించాలంటే గట్స్ ఉండాలనే సంగతి తెలిసిందే. రజనీ మాత్రం పాత్రకు ప్రాధాన్యత ఇచ్చి విభిన్నమైన పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే టాలీవుడ్ స్టార్స్ ఇలాంటి రోల్స్ చేస్తారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ జైలర్ తరహా పాత్రలను ఎంచుకోవడం టాలీవుడ్ హీరోలకు సాధ్యమా? అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్ స్టైల్ కు, స్వాగ్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 72 సంవత్సరాల వయస్సులో సైతం రజనీకాంత్ అద్భుతమైన నటనతో మెప్పిస్తుండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.

రజనీకాంత్ జైలర్ సినిమా తెలుగులో సైతం భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. రజనీకాంత్ కొత్త ప్రాజెక్ట్ లు సైతం విభిన్నమైన కథలతో తెరకెక్కుతున్నాయని ఈ సినిమాలు సైతం భారీ రేంజ్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. రజనీకాంత్ జైలర్ సినిమాతో సక్సెస్ సాధించడంతో ఈ హీరో తర్వాత ప్రాజెక్ట్ లకు సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. జైలర్ సినిమాలోని కొన్ని సీన్లకు గూస్ బంప్స్ వస్తున్నాయి.

బాలయ్య ఈ సినిమాలో ఒక రోల్ మిస్ అయ్యారని తెలిసి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య ఈ సినిమాలో నటించి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. రజనీ పాత్రలను ఎంచుకుంటున్న విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus