Rajinikanth: రజనీకాంత్‌ కొత్త సినిమా గ్లింప్స్‌కు అంతా రెడీ… ఏం చూపిస్తారో?

సూపర్‌ స్టారే కానీ సరైన విజయం లేదు.. గత కొన్నేళ్లుగా రజనీకాంత్‌ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. అలాంటి మాటల్ని రూ. 600 కోట్ల వసూళ్లతో మూయించేశాడు తలైవా. ఆ సినిమానే ‘జైలర్‌’. థియేటర్లలో మాస్‌ మేనియా సృష్టించిన రజనీ… ఇప్పుడు తన నెక్స్ట్‌సినిమా కోసం ఇంకాస్త జోష్‌తో రెడీ అవుతున్నాడు. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రజనీకి 170వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిసింది.

రజనీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా అంటే… ఈ నెల 12న సినిమా నుండి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్‌ వస్తున్నాయట. కోడంబాక్కం వర్గాల సమాచారం కరెక్ట్‌ అయితే… ఆ రోజు ఆ సినిమా నుండి టైటిల్‌, టీజర్‌ వస్తుందని చెబుతున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడే పోలీసు అధికారిగా ఈ సినిమాలో రజనీకాంత్‌ కనిపించనున్నట్లు ఇప్పటికే లీకులు వచ్చాయి. ఆ విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం కన్యాకుమారిలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయాలని టీమ్‌ ప్లాన్స్‌ చేస్తోంది. అందుకు తగ్గట్టుగా రజనీ షెడ్యూల్స్‌ ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ క్రమంలో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషార విజయన్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, రానా, ఫహాద్‌ ఫాజిల్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

రజనీని చూడటానికి షూటింగ్‌ స్పాట్‌కి అభిమానులు రోజూ పెద్ద సంఖ్యలో వస్తున్నారట. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘తలైవా ఎక్కడున్నా సూపర్‌ స్టార్‌… ఎన్ని డిజాస్టర్లు వచ్చినా సూపర్‌ స్టారే’ అంటూ ఆ వీడియోలకు కామెంట్లు చేస్తున్నారు. తన కోసం వస్తున్న అభిమానులకు (Rajinikanth) రజనీకాంత్‌ కారు నుండి బయటకు వచ్చి అభివాదం చేశారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus