Rajinikanth: మణిరత్నం కోసం సినిమా వాయిదా వేసుకున్న తలైవా!

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ సినిమా విడుదలను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. విడుదల తేదీ ఏప్రిల్ 14 నుంచి ఆగస్టు 11కి వాయిదా వేసినట్లు సమాచారం. ‘జైలర్’ సినిమా విడుదల వాయిదాకు కారణం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ అని టాక్.

దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చారిత్రక సినిమా రెండో భాగం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య క్లాష్ ఉండకూడదని ‘జైలర్’ టీమ్ భావిస్తోందట. అందులో భాగంగానే ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఉన్న సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ విషయానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికే ‘జైలర్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘జైలర్’ సినిమా కథ మొత్తం ఒకే రాత్రిలో ఉంటుందట. డే టైం షాట్స్ తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అవి కూడా కొద్ది నిమిషాల పాటే ఉంటాయట. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నముగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రజినీకాంత్ ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివకుమార్ తో పాటు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారట.

ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్1 మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్2ని ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus