రెండేళ్ల క్రితం మాట అనుకుంటాం… రజనీకాంత్ ఇక సినిమాలు చేయరు, ఇదిగో ఆఖరి సినిమా, అదిగో ఆఖరి సినిమా అంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రాజకీయాలు వదిలేసినప్పటి నుండి ఇలాంటి వార్తలొచ్చాయి. సినిమాలకు ఆయన విరామం కానీ, పూర్తిగా వదిలేయడం కానీ చేస్తారు అనేది ఆ పుకార్ల సారాంశం. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా అనిపించడం లేదు. వరుస సినిమాలు ఓకే చేస్తున్నారు తలైవా.
ఇప్పుటికే సెట్స్ మీద రెండు సినిమాలు పెట్టిన రజనీకాంత్, మరో రెండు సినిమాలు ఓకే చేశారు. అందులో లోకేశ్ కనగరాజ్ సినిమా ఇప్పటికే అనౌన్స్ చేయగా, మరో సినిమా తాజాగా ఓకే చేశారు. ఈ మేరకు తలైవా కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ‘పరియరుమ్ పెరుమాళ్’, ‘కర్ణన్’, ‘మామన్నన్’ లాంటి సినిమాలతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ 172వ సినిమా ఉండనుంది. ఈ విషయాన్ని సోమవారం ప్రకటించారు.
దీంతో రజనీ (Rajinikanth) అభిమానుల్లో ఆనందోత్సహాలు వ్యక్తం అవుతున్నాయి. సరికొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయడం, అందులో కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా చూసుకోవడం మారి సెల్వరాజ్‌కు అలవాటు. ఇప్పుడు రజనీతో కూడా అలాటి కథే చేస్తారు అనేది అభిమానుల నమ్మకం. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ‘లాల్ సలామ్’ సినిమాలో అతిథి పాత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకున్న రజనీ ‘వేట్టయాన్’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.
జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సమాజంలోని కీలక అంశాల్ని చర్చిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ సినిమా స్టార్ట్ చేస్తారట. ఈ సినిమా కూడా ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ కిందకే వస్తుంది అని చెబుతున్నారు. మొత్తం ఎల్‌సీయూకి తలైవా హెడ్ అయ్యేలా కథను రాసుకుంటున్నారట. సినిమా మొదలయ్యాక ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన ఇప్పుడు రజనీ లైనప్‌లో మొత్తంగా నాలుగు సినిమాలు ఉన్నాయి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!