Rajinikanth: ‘బీస్ట్’ డైరెక్టర్.. క్రేజీ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా..?

  • April 21, 2022 / 06:09 PM IST

నయనతార ప్రధాన పాత్ర పోషించిన ‘కొలమావు కోకిల’, శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘డాక్టర్’ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా నెల్సన్ దిలీప్ కుమార్. ఆ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘డాక్టర్’ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. డార్క్ నేచర్ ఉన్న థ్రిల్లర్ కథలను ఎన్నుకొని.. ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ‘డాక్టర్’ సినిమా విడుదల కాకముందే విజయ్ లాంటి స్టార్ హీరో నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు.

Click Here To Watch NOW

సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ వీరి కలయికలో సినిమాను నిర్మించింది. అదే ‘బీస్ట్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మొదటి షో నుంచే సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో చాలా చోట్ల సినిమాకి కలెక్షన్స్ లేవు. తమిళనాడులో కూడా వీకెండ్ వరకు సందడి చేసి ఆ తరువాత చతికిలపడింది. అయితే ‘బీస్ట్’ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ తో దిలీప్ చేయాల్సి ఉన్న కొత్త సినిమా క్యాన్సిల్ అయినట్లుగా రెండు, మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాను ‘బీస్ట్’ రిలీజ్ కు ముందే ఘనంగా అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఖరారయ్యారు. అయితే ‘బీస్ట్’ సినిమా నిరాశ పరచడంతో నెల్సన్ మీద రజినీ, సన్ పిక్చర్స్ అధినేతలకు నమ్మకం పోయిందని.. దీంతో సినిమాను ఆపేస్తున్నారని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే నెల్సన్ దీనికి సమాధానం ఇచ్చాడు. ఈ రూమర్లపై పరోక్షంగా స్పందించాడు నెల్సన్.

‘బెటర్ లక్ నెక్స్ట్ టైమ్’ అంటూ సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టాడు. అలాగే తన ట్విట్టర్ బయోలో కొత్తగా ‘తలైవర్ 169’ అంటూ ఈ సినిమాను సూచించే హ్యాష్ ట్యాగ్ జోడించి ఈ సినిమా క్యాన్సిల్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చాడు!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus