Rajinikanth Vs Balakrishna: మొన్న చిరంజీవి.. ఇప్పుడు బాలయ్యని టార్గెట్ చేసిన రజనీ.!

గత ఏడాది ఆగస్టు 10 న రజినీకాంత్ (Rajinikanth) నటించిన ‘జైలర్’ (Jailer) సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అందరి చూపు ఆగస్టు 11న రిలీజ్ అవుతున్న ‘భోళా శంకర్’ (Bhola Shankar) పైనే ఉంది. మెహర్ రమేష్ (Meher Ramesh) డైరెక్టర్ కాబట్టి.. ‘భోళా శంకర్’ పై నెగిటివిటీ ఉన్నప్పటికీ.. ఓపెనింగ్స్ పరంగా ‘జైలర్’ పై అదే పైచేయి సాధిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. ‘జైలర్’ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

ప్రేక్షకులు ‘మస్ట్ వాచ్’ అని జైలర్ కి ఫిక్స్ అయ్యారు. ‘భోళా శంకర్’ కి యునినామాస్ గా నెగిటివ్ టాక్ రావడంతో ‘జైలర్’ డామినేషన్ ఎక్కువయ్యింది. ఫుల్ రన్లో జైలర్ ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ ఏడాది రజినీ .. బాలయ్య (Nandamuri Balakrishna) సినిమాని టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతుంది. విషయం ఏంటంటే.. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ (K. S. Ravindra) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘వీర మాస్’ అనే వర్కింగ్ టైటిల్ తో ఆ సినిమా రూపొందుతుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సరిగ్గా అదే టైం కి రజినీకాంత్ నటించిన ‘వెట్టాయన్’ (Vettaiyan) కూడా రిలీజ్ అవ్వనుంది. ‘జై భీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ (T. J. Gnanavel) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. రజనీ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే.. బాలయ్య సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus