ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రాకేష్ మాస్టర్ జూన్ 18 న ఆదివారం నాడు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈయన మరణ వార్త టాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసిందనే చెప్పాలి. రాకేష్ మాస్టర్ 1500 కి పైగా సినిమాలకి కొరియోగ్రఫీ చేశారు. కొత్త హీరోల సినిమాలకు ఈయన ఎక్కువగా కొరియోగ్రఫీ అందించేవారు. ప్రభాస్ కి డాన్స్ నేర్పించింది ఇతనే. ప్రభాస్ కూడా ఓ సందర్భంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. శేఖర్ మాస్టర్ ఈయన శిష్యుడే.దర్శకుడు వైవిఎస్ చౌదరి తెరకెక్కించే సినిమాలకు ఈయనే కొరియోగ్రఫీ అందించేవారు.
ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఆయన చివర్లో యూట్యూబ్ ఛానల్ లకి ఇంటర్వ్యూలు ఇచ్చి …నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ … సెలబ్రిటీల పై షాకింగ్ కామెంట్లు చేసేవారు. చివరి రోజుల్లో బీపీ, షుగర్ వ్యాధులతో ఈయన తీవ్రంగా బాధపడేవారని సమాచారం. ఇదిలా ఉండగా.. రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అతను మాట్లాడుతూ.. ‘రోజు రోజుకీ మా నాన్న దిగజారిపోవడానికి కారణం మీడియా.
ఇందులో ఎలాంటి సందేహం లేదు.లైక్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఆయన్ని ఇంటర్వ్యూలకి పిలిచి ఆయన్ని రెచ్చగొట్టి ఏవేవో మాట్లాడించేవారు. ఇక చాలు. ఆయన పోయారు. ఇక మా జోలికి రాకండి. ‘మీ నాన్నగారు పోయిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ కష్టాలు ఏంటి? మా నాన్న చనిపోయారు కాబట్టి మేము ఎలా ఏడుస్తున్నాము. ? అంటూ మా జీవితాలను చీకట్లోకి లాగకండి. మమ్మల్ని ఇలా వదిలేయండి’ అంటూ (Rakesh Master) రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ మండిపడ్డాడు.