ఒకప్పుడు సినిమాలు కేవలం ఆయా భాషలకు మాత్రమే పరిమితం అయ్యేవి.కానీ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఒక సినిమా తెరకెక్కి అన్ని భాషలలో విడుదల అవుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలకు మేకర్స్ పాన్ ఇండియా అనే పేరు పెట్టారు. బాహుబలి సినిమాతో మొదలైన ఈ ప్రయాణం ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. ఇలా ఒక భాషలో తెరకెక్కిన సినిమా అన్ని భాషలలో విడుదల కావడంతో సినిమాకు భాషతో సంబంధం లేదనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎంతో మంది తారలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.తాజాగా నటి రకుల్ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. నేను హిందీలో డబ్ చేసిన నా సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి.అయితే ఇది ఎప్పటినుంచో జరుగుతుంది ప్రస్తుతం ఇలా సినిమాలు ఇతర భాషలలో నేరుగా థియేటర్లో విడుదల కావటం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారు.
సినిమాకి భాషతో సంబంధం ఉండదు సినిమా కేవలం ఒక ఎమోషనల్ జర్నీ అంటూ చెప్పుకొచ్చారు.ఇక ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. దక్షిణాది సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం సంతోషంగా ఉంది ఇలా సౌత్ సినిమాలు,నార్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం అంటూ ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ భాష గురించి, సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.