నాకు ట్రోలింగ్ అలవాటైపోయింది..!

 ఆగ‌స్టు 9 న ఈ చిత్రం విడుద‌ల‌ కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన రెండు టీజ‌ర్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ టీజర్లు రకరకాల వివాదాలకు దారి తీశాయి. మొదటి టీజర్ లో నాగార్జున యువ హీరోయిన్లతో రొమాన్స్, మరియు లిప్ లాక్ లు పెట్టడం.. అలాగే రెండో టీజర్ లో రకుల్ సిగ‌రెట్ తాగుతూ కనిపించడం పెద్ద దుమారమే రేపింది.

సోషల్ మీడియాలో అయితే రకుల్ పై నెటిజ‌న్లు విమర్శ‌లు చేయడం మొదలు పెట్టారు…! తాజాగా ఈ విమ‌ర్శ‌ల‌ పై ర‌కుల్ స్పందించింది… `మ‌నం ఏం చేసినా ఏదో ఒక‌టి అంటూనే ఉంటారు. వారి పనే అది క‌దా..! మొన్న విడుద‌లైన `క‌బీర్ సింగ్‌`లో షాహిద్ సిగ‌రెట్ కాల్చారు. కానీ, నిజ జీవితంలో ఆయ‌న కాల్చరు. సినిమాను, నిజ జీవితాన్ని క‌లిపి చూడ‌కూడ‌దు. పాత్ర ప‌రంగా సినిమాలో సిగ‌రెట్ కాల్చాల్సి వ‌చ్చింది. అలా ఎందుకు కాల్చాల్సి వ‌చ్చిందో సినిమా చూస్తే అర్ధమవుతుంది. నాకు ట్రోలింగ్ అల‌వాటైపోయింది. నేను ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాను. ఎందుకంటే నాకు అంత‌కంటే ముఖ్య‌మైన ప‌నులు చాలా ఉన్నాయి` అంటూ సమాధానమిచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus