రకుల్ తన పారితోషికాన్ని తగ్గించుకొంటానని, ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగానే ఉన్నానని దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోందట ‘కొండపొలం’ తర్వాత తెలుగులో సినిమాలేం చేయలేదు రకుల్‌ప్రీత్ సింగ్. ‘కొండపొలం’ వచ్చి రెండేళ్లే దాటేసింది. కాకపోతే.. ఈలోగా ఓ అరడజను హిందీ ప్రాజెక్టుల్లో మెరిసింది. అవేం రకుల్‌కి కెరీర్ పరంగా పెద్దగా సాయపడలేదు. ఈలోగా.. టాలీవుడ్ రకుల్‌ని పూర్తిగా మర్చిపోయింది. ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. రకుల్ మాత్రం తెలుగులో మళ్లీ మెరవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
తన పారితోషికాన్ని తగ్గించుకొంటానని, ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగానే ఉన్నానని దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోందట. అయితే రకుల్ రీ ఎంట్రీ అంత ఈజీ కాదు. ఎందుకంటే శ్రీలీల, కృతిశెట్టి రూపంలో యువ కథానాయికల నుంచి గట్టి పోటీ ఏర్పడుతోంది. దానికి తోడు… బాలీవుడ్ కథానాయికల హవా తెలుగులో బాగా ఉంది. వీళ్లందరి ధాటిని తట్టుకోవడం కష్టమే. అయితే రకుల్ చేతిలో ‘ఇండియన్ 2’ ఉంది. ఇది పాన్ ఇండియా సినిమా.
తెలుగులోనూ భారీ స్థాయిలోనే విడుదల అవుతుంది. ఈ సినిమాతో (Rakul Preet) రకుల్ జాతకం మారే అవకాశం ఉంది. ‘ఇండియన్ 2’ హిట్టయి, అందులో రకుల్ పాత్రకు మంచి పేరొస్తే… టాలీవుడ్ నుంచి ఇంకొన్ని అవకాశాలు రాబట్టొచ్చు. మరి శంకర్ ఏం చేస్తాడో చూడాలి. అలాగే రకుల్ కి ఇంకో ఛాన్స్ కూడా ఉంది. కుర్ర హీరోలే అని కూర్చోకుండా..
చిరు, బాలయ్య వంటి వారి సరసన నటించేందుకు కూడా రెడీ అనేలా సంకేతాలు ఇస్తే మాత్రం.. మరోసారి టాలీవుడ్‌లో ఆమె బిజీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే యంగ్ హీరోయిన్ శృతిహాసన్ ఈ మధ్య ఈ ఇద్దరితో హిట్ కొట్టి మళ్లీ రేసులోకి వచ్చింది. మరి ఇలాంటి తరుణంలో రకుల్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ..
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!