దశాబ్దం క్రితం హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టి వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్. మధ్యలో ఆఫర్లు తగ్గినట్టు అనిపించినా మళ్లీ రకుల్ వరుస సినిమాలతో బిజీ కావడం గమనార్హం. రకుల్ లాయర్ గా నటించిన చెక్ మూవీ ఫిబ్రవరి 26వ తేదీన విడుదలై మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. చెక్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రకుల్ కీలక విషయాలను వెల్లడించారు. జర్నీ ఎప్పుడూ ఎగ్జయిటింగ్‌గా ఉండాలని భిన్నమైన పాత్రలు చేయాలనే ఉద్దేశంతో తాను సినిమాలను ఎంపిక చేసుకోనని రకుల్ అన్నారు.
సెట్ కు వెళ్లిన ప్రతిరోజూ ఎగ్జయిటింగ్‌గా లేకపోతే పని సరిగ్గా చేయలేమని రకుల్ తెలిపారు. మానస అనే లాయర్ పాత్రను చాలా ఎంజాయ్ చేశానని చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రకుల్ అన్నారు. అర్జున్ కపూర్ తో తాను ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో ఆయన తన్ పేరులో ప్రీత్ సింగ్ అనే పదాలను తొలగిస్తే తాను తెలుగమ్మాయినే అంటూ చెప్పారని ఇంటర్వ్యూలో రకుల్ వెల్లడించారు. చెక్ షూటింగ్ సెట్లో తెలుగులోనే మాట్లాడుకునే వాళ్లమని రకుల్ తెలిపారు.
కరోనా వల్ల ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ఫిట్ నెస్ ఎంత అవసరమో అందరికీ తెలియజేసిందని, కరోనా తగ్గిన తర్వాత తనకు బలం పోయినట్టు అనిపించిందని రకుల్ అన్నారు. మనం కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇతరులకు మన నుంచి కరోనా సోకకుండా జాగ్రత్త వహించాలని రకుల్ చెప్పారు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మేకప్ లేకుండా పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించానని రకుల్ అన్నారు.