పోలీసు పాత్రలో కనిపించడానికి మన హీరోలు చాలా ఆసక్తిచూపిస్తుంటారు. ఎందుకంటే ఆ పాత్రల్లో ఇన్‌స్టంట్ యాక్షన్, మాస్ మేనరిజమ్ ఉంటాయి. అలా చాలామంది హీరోలు పోలీసు అయ్యి.. మాస్ హీరోగా మంచి మార్కులు సంపాదించుకున్నారు. యువ హీరోల్లో ఈ ఛాన్స్ కాస్త ఆలస్యంగా అందుకుంటున్న హీరో రామ్. ‘వారియర్’ సినిమాతో రామ్ తమిళ – తెలుగు పోలీసు అవుతున్నాడు. అయితే ఈ సినిమా కథ వెనుక కీలకాంశం ఉందంటూ వివరించాడు రామ్.
‘‘పోలీస్ పాత్రతో ఓ సినిమా చేద్దామని చాలా కథలు విన్నాను. వరుసగా విన్న తర్వాత అన్నీ ఒకేలా అనిపించి, ఇక ఆ కథలు వద్దనుకున్నా. ఆ సమయంలోనే లింగుస్వామి కథ చెప్పారు. ఆ కథ విన్న తర్వాత పోలీస్ కథలంటూ చేస్తే, ఇలాంటివే చేయాలనిపించింది’’ అని చెప్పాడు రామ్. పూర్తిగా భావోద్వేగాలు నిండిన కథ ఇది. స్ఫూర్తినిచ్చే పోలీస్ అధికారులు చాలా మంది ఉన్నారు వారందరి కథలతోనే ఈ సినిమా కథ రూపొందించారు లింగుస్వామి అని చెప్పాడు రామ్.
ఎప్పుడూ జీవితంలో మన నియంత్రణలోనే ఉన్న పనులు చేయడమే కాదు… ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దాని ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుంది, వెళ్లాలి అని చాటి చెప్పిన అధికారులు కొంతమంది ఉన్నారు. వాళ్ల కథల్ని కలిపి ఇందులోని సత్య అనే పోలీస్ పాత్రని రాశారు అంటూ సినిమాతో తన పాత్ర గురించి చెప్పారు రామ్. సినిమా అంతగా పోలీసు జీవితాన్ని చూపించాం అని ఆయన చెప్పకనే చెప్పారు. మరి ఆ పవర్ చూడాలంటే 14వ తేదీ వరకు ఆగాల్సిందే.
ఇక ఈ సినిమా తనకు బాగా ఎమోషనల్ అని చెబుతూ.. తనకు జరిగిన గాయం గురించి మాట్లాడాడు రామ్. ఓ రోజు జిమ్‌కు వెళ్దామని అనుకుంటున్నప్పడు మెడకు గాయమైంది. ఎన్నిరోజులైనా తగ్గడం లేదు.. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ‘వర్కవుట్లు చేస్తే ఒక కేజీ బరువుతో చేయొచ్చని అన్నారాయన. అలా కుదరదు.. ఫిట్‌గా ఉండాలి బరువులు ఎక్కువ పెట్టాలి అన్నాను’ అని చెప్పాడు రామ్.
దానికి ఆ డాక్టర్ మీకు లైఫా? సినిమానా? అని అడిగారట. దానికి రామ్ సినిమానే లైఫ్‌గా అనుకునే వాళ్లకు అది అవుట్ సిలబస్ ప్రశ్నలా అనిపిస్తుంది అని అన్నారట. ఆ తర్వాత మీరా? నేనా? అనే ప్రశ్న వస్తే.. మీరు లేకపోతే నేను లేను అని.. గతంలో ఓ సందర్భంలో అన్న మాట గుర్తొచ్చిందట రామ్. నాకు అర్థమైంది. దీంతో ఎంత పెయిన్ ఉన్నా కూడా డ్యాన్సులు, యాక్టింగ్ చేశారట. అంత మీ వల్లే వచ్చింది అని చెప్పారు రామ్.