Ram Charan: మెగా- ప్రశాంత్‌ నీల్‌ వైరల్‌ పిక్‌ వెనుక ఏం జరిగింది…!

మెగా కాంపౌండ్‌లో ప్రశాంత్‌ నీల్‌… ఈ ఫొటో బయటకు రాగానే… రామ్‌చరణ్‌తో సినిమా ఉంటుందా? అంటూ చర్చలు మొదలయ్యాయి. నిజానికి ఆ ప్రశాంత్‌ నీల్‌ ఆ ఫొటో ట్వీట్‌ చేస్తూ… ఆఖరున ‘డీవీవీ మూవీస్‌’ ప్రొడక్షన్‌ హౌస్‌ను ట్యాగ్‌ చేశాడు. దీంతో ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది అని ఫిక్స్‌ అయిపోయారు అభిమానులు. ఇటీవల చరణ్‌ ‘నాట్యం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ ‘అది జస్ట్‌ డిన్నర్‌’ అని తేల్చేశాడు. దాంతోపాటు ‘మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడదాం’ అన్నాడు. ఈ లెక్కన సినిమా పక్కా అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటే డౌట్.

ప్రశాంత్‌ నీల్‌తో రామ్‌చరణ్‌ సినిమా ఉంటుంది అని ఎంచక్కా అధికారికంగా ట్వీట్‌ చేయొచ్చు కదా. అలా కాకుండా ఎప్పుడో తీసిన పాత ఫొటోను ఇప్పుడెందుకు ట్వీట్‌ చేయించారు అనేది అర్థం కావడం లేదు. అవును మీరు చదివింది నిజమే. ఆ ఫొటో పాతది అని సులభంగా చెప్పేయొచ్చు. ఈ ఫొటోల్లో రామ్‌చరణ్‌ సాధారణ దుస్తుల్లో ఉన్నాడు. కానీ చరణ్‌ కొద్ది రోజుల నుండి అయ్యప్ప మాలలో ఉన్నాడనే విషయం మనకు తెలిసిందే.

ఏటా చరణ్‌ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటుంటాడు. గతవారం జరిగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు కూడా మాలలోనే వచ్చాడు. అంటే ప్రశాంత్‌ నీల్‌ ఫొటో అంతకంటే ముందే తీసి ఉండాలి. పోనీ పార్టీ కదా… అని సాధారణ దుస్తుల్లో వచ్చాడు అనుకోలేం. అది తప్పు కూడా. కాబట్టి… చాలా రోజుల క్రితమే తీసిన (కనీసం పది రోజులు) ఫొటోను ఇప్పుడు ట్వీట్‌ చేయించి… ‘సలార్‌’ తర్వాత ప్రశాంత్‌ సినిమా… ‘నాతోనే’ అని చరణ్‌ చెప్పకనే చెప్పించడా? అనేది తెలియాల్సి ఉంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus