చెర్రీ…మరో మగధీర చెస్తున్నాడా??

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో చెర్రీ కూడా ఒకడు. అయితే మెగా స్టార్ వారసత్వం, మెగా ఫ్యాన్స్ అభిమానం చెర్రీని టాప్ లెవెల్ లో నిలబెట్టింది అనే చెప్పాలి…అయితే అదే క్రమంలో కరియర్ తోలు రోజుల్లో వరుసగా సూపర్ డూపర్ హిట్స్  అందుకున్న మన మెగా పవర్ స్టార్ కాల క్రమేణా…డిజాస్టర్స్ బాట పట్టడంతో అనుకోకుండా చెర్రీ కరియర్ ఇబ్బందుల్లో పడింది అనేర్ చెప్పాలి…కొన్ని కధలను అనుకోకుండా ఎంచుకున్న చెర్రీ…ఇప్పుడు సొంత కధలను వదిలేసి….తమిళ హిట్ సినిమా కధ పై పడ్డాడు….దాన్నే తెలుగులో “ధృవ”గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాని ఎలా అయినా హిట్ చెయ్యాలి అన్న కసితొ పనిచేస్తున్నాడు చెర్రీ….ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ మరో నెలలో పూర్తి అయిపోతున్న క్రమంలో తన తరువాత ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు చెర్రీ.

అందులో ముఖ్యంగా ఈ సినిమాని ట్యాలెంటెడ్ అండ్ లాజికల్ దర్శకుడు సుకుమార్ తో తీస్తున్నాడు…అసలైతే….సుక్కు తో సినిమా ఎప్పుడో ఉండాలి…అంతేకాదు….రకరకాల కధలు సైతం టాలీవుడ్ లో చక్కెర్లు కొట్టాయి….అందులో కొందరు….సైంటిఫిక్ మూవీ అని.. లవ్ స్టోరీ అని.. పల్లెటూరి ప్రేమ అని.. ఇలా రకరకాల టాక్స్ ను స్ప్రెడ్ చేశారు. అయితే ఇదిలా ఉంటే కాస్త లేట్ గా వచ్చినా సుక్కు మాత్రం కొత్త డిఫరెంట్ లవ్ స్టోరీ తో వచ్చినట్లు టాక్. అంతేకాదు…ఇదో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తారట మన దర్శకుడు. పాతికేళ్ల క్రితం సెల్ ఫోన్లు లేని కాలంనాటి ఓ అందమైన ప్రేమకథను ఆవిష్కరిస్తాడట సుక్కు. అందుకే ఈ ప్రాజెక్ట్ చెర్రీకి నచ్చేసి ఒకే చెప్పేసాడని టాక్. మరి మగధీర తో సూపర్ హిట్ అందుకున్న మన మెగా పవర్ స్టార్…..ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ కు చెక్ పెడతాడో చూడాలి.

Sukumar - Ram Charan Movie Based on Historical Concept - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus