Ram Charan, Upasana: ఆఫ్రికా అడవుల్లో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్..

ఆర్ఆర్ఆర్ జపాన్ రిలీజ్ ప్రమోషన్స్ కోసం అక్కడికి బయలుదేరిన దగ్గరినుండి రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. వాళ్ల ఫ్యామిలీ పిక్స్, వీడియోస్.. వాళ్లకి సంబంధించిన న్యూస్ అన్నీ వైరల్ అవుతున్నాయి.. ట్రిపులార్ మూవీ మరోసారి దర్శకుడు రాజమౌళికి, తెలుగు సినిమాకి, టాలీవుడ్ యాక్టర్స్‌కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చింది. ట్రిపులార్ జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అక్కడి జనాలు తమ మీద చూపించిన ఆదరణకి తారక్, చరణ్ ఇద్దరూ సర్‌ప్రైజ్ అయ్యారు.

రీసెంట్‌గా ఈ చిత్రాన్ని సాటర్న్ బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్‌ వరించింది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సాటర్న్ అవార్డ్స్‌లో RRR బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇంతకుముందు ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్‌కి కూడా ఈ అవార్డ్ వచ్చింది. వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ ఎంపైర్ మ్యాగజైన్ రాజమౌళిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడమే కాకుండా ఎంపైర్ మ్యాగజైన్ RRR సినిమా గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ ప్రచురించింది. ఈ న్యూస్ వైరల్ అవుతుండగానే..

రామ్ చరణ్ కొత్త వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆఫ్రికా అడవుల్లో వైల్డ్‌లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు చరణ్. భార్య ఉపాసనతో కలిసి అక్కడికి వెళ్లిన చరణ్.. సఫారీలో ఆ ప్రాంతమంతా సరదాగా తిరుగుతూ.. పులులను ఫొటోలు తీశాడు. అలాగే అక్కడి వర్కర్లతో కలిసి కుకింగ్‌లో ఓ చేయి వేశాడు. రన్నింగ్‌లో ఉండగానే ఫోటోలకు ఫోజులిచ్చాడు చరణ్‌. స్టైలిష్ అండ్ కూల్ లుక్‌తో కనిపిస్తున్నాడు మెగా పవర్ స్టార్..

చెర్రీ లేటెస్ట్ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్ వచ్చాక శంకర్ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు చరణ్. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న RC 15 చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిలిం అవబోతుందంటున్నారు మేకర్స్..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus