RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో ఎన్టీఆర్ గత 15 రోజులుగా అమెరికాలో ఉంటూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా అమెరికాలో సందడి చేస్తూ ఎట్టకేలకు ఆస్కార్ అందుకొని తిరిగి స్వదేశానికి రాబోతున్నారు.
ఇలా ఒక తెలుగు సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ విషయంపై స్పందిస్తూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక చిత్ర బృందం మొత్తం బుధవారం తిరిగి ఇండియాకు రానున్నారు. ఇలా వీరు ఇండియాకి తిరిగి రావడమే ఆలస్యం వీరిని ఇక్కడ ఎంతో ఘనంగా సత్కరించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇలా RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని కూడా అందుకున్నారు. ఈయన ఇండియా తిరిగి రాగానే ఈ నెల 17 18న న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కార్యక్రమంలో చరణ్ పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో కలిసి వేదిక పంచుకోనున్నారు.
ఇలా ఈ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ మరొక అరుదైన గౌరవాన్ని అందుకోవడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వేడుకపై రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ వైడ్ సక్సెస్ కావడంతో పాటు ఆస్కార్ గెలుచుకోవడం అనే విషయాల గురించి మాట్లాడనున్నారని తెలుస్తుంది.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్