పాతికేళ్ల కథతో రూపుదిద్దుకున్న రంగస్థలం నేటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుకుమార్, రామ్ చరణ్ తేజ్ కలయికలో వచ్చిన ఈ సినిమా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 130 కోట్ల (గ్రాస్ )వసూలు చేసి రికార్డుసృష్టించింది. కేవలం 7 రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తొమ్మిదో తెలుగు చిత్రంగా నిలిచిందని ట్రేడ్ వర్గాలవారు చెప్పారు. అంతేకాదు అత్యధిక కలక్షన్స్ సాధించిన తెలుగు చిత్రాల్లో ఎనిమిదవ స్థానం దక్కించుకుంది.
బాహుబలి, బాహుబలి 2 , ఖైదీ నంబర్ 150 , మగధీర, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, అత్తారింటికి దారేది, సరైనోడు(125 ).. ఇలా ఉండగా.. వారానికే సరైనోడు ను పక్కన పెట్టి 130 కోట్లతో 8 స్థానంలో రంగస్థలం నిలిచింది. రెండో వారానికి మరికొన్ని సినిమాలను దాటుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నాలుగో స్థానంలో ఉన్న మగధీర (151 కోట్లు)ను సైతం దాటుకుంటూ వెళుతుందని మెగా అభిమానులు ధీమాగా చెబుతున్నారు. రంగస్థలం జోరు చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నిటినీ తిరగరాసేలా ఉంది.