యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల్లో మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకుల్లో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్30 సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం జాన్వీ కపూర్ కు సంబంధించిన ఫోటో షూట్ పూర్తైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ తారక్ గొప్పదనాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు.
లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒక ఈవెంట్ లో చరణ్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న స్నేహం, అనుబంధం గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు తనకు మధ్య చాలా సంవత్సరాల నుంచి స్నేహం ఉందని మేమిద్దరం ఎప్పటినుంచో కాంటాక్ట్ లో ఉన్నామని చరణ్ చెప్పుకొచ్చారు. అయితే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కలవడం మాత్రం సాధ్యమయ్యేది కాదని చరణ్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ మూవీ మా ఇద్దరినీ మరింత దగ్గరయ్యేలా చేసిందని ఆయన కామెంట్లు చేశారు.
ఈ సినిమా కోసం ఇద్దరం కలిసి ప్రయాణం చేశామని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ లో మా ఇద్దరినీ హీరోలుగా ఎంపిక చేసిన రాజమౌళికి ధన్యవాదాలు అని రామ్ చరణ్ కామెంట్లు చేశారు. తారక్ ఉండటంతో నేను కూడా సులువుగా నటించానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నేను జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో మిస్ అవుతున్నానని వేరే పనులు ఉండటం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడికి రాలేదని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నా అని చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్ చెప్పిన విషయాలు తారక్ అభిమానులకు సైతం సంతోషాన్ని కలిగిస్తున్నాయి. చరణ్ తారక్ భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో కలిసి నటించడంతో పాటు వాళ్లిద్దరి మధ్య స్నేహ బంధం కొనసాగాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. చరణ్ తారక్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!