శనివారం జరిగిన కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకను గమనిస్తే మెగా హీరోలందరూ ఒకవైపు, పవన్ కళ్యాణ్ మరొక వైపు అని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఫంక్షన్ కి మెగా హీరోలు ఒకరు కూడా రాలేదు. కనీసం మెగా బ్రదర్ నాగేంద్రబాబు కూడా కనిపించలేదు. దీంతో పవన్ తో సంబంధాలు తెగిపోయాయని అందరూ భావించారు. అభిమానులు కూడా చాలా నిరాశ చెందారు. కానీ అటువంటిది ఏమీలేదని అబ్బాయి రామ్ చరణ్ తేజ్ స్పష్టం చేశారు. బాబాయ్ తాజా చిత్రం కాటమరాయుడు ట్రైలర్ పై స్పందించి తాము విడిపోలేదని సంకేతమిచ్చారు.
తన పేస్ బుక్ పేజీలో కాటమ రాయుడు ట్రైలర్ లింక్ పెట్టి ”మన అందరి కాటమ రాయుడు మార్చి 24 న థియేటర్ లలోకి వస్తున్నాడు,. ట్రైలర్ పవర్ ప్యాక్డ్ సెలెబ్రేషన్ లా ఉంది” అంటూ కామెంట్ చేసాడు. ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన కాటమరాయుడు ఉగాది పండుగను ముందుగానే తీసుకురానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.