భారత్ లో జీ-20 సదస్సు సోమవారం జమ్మూకశ్మీర్ వేదికగా ప్రారంభమైంది. మొత్తం 60 మందికి పైగా విదేశీ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత జమ్ముకశ్మీర్ లో నిర్వహించిన మొదటి సదస్సు ఇది కావడం విశేషం మూడు రోజులు పాటు జరిగే ఈ వేడుకలు సోమవారం ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.మూడు రోజులు పాటు జరిగే ఈ వేడుకలలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ముఖ్యఅతిథిగా పాల్గొనే అవకాశం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వచ్చిందని చెప్పాలి.
ఈ క్రమంలోనే (Ram Charan) రామ్ చరణ్ g 20 సదస్సులో పాల్గొని సందడి చేస్తున్నారు.ఇక ఈ వేడుకలలో భాగంగా ఈయన మాట్లాడుతూ కాశ్మీర్ అందాలను ప్రశంసించడమే కాకుండా ఇకపై తన సినిమా షూటింగులన్నీ ఇక్కడే జరుగుతాయని లొకేషన్ లకోసమే విదేశాలకు వెళ్లాల్సిన పనిలేదని ఇండియాలో కూడా ఇలాంటి ఎన్నో అందమైన లొకేషన్స్ ఉన్నాయంటూ తెలియజేశారు. ఇక ఈ సదస్సులో రామ్ చరణ్ నాటు నాటు స్టెప్పులు వేస్తూ అందరిని సందడి చేశారు.
రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR.ఈ సినిమాలోని నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆవాద అందుకున్న ఈ పాటను g20 సదస్సుపై దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జె.బోక్ తో కలిసి ‘నాటునాటు’ పాటకు స్టెప్పులేసి అందరిని అలరించారు రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది..
ఇక ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందిందో మనకు తెలిసిందే. ఈ పాటకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రామ్ చరణ్ ఎన్టీఆర్ లకు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ లభించింది అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు పొందుతూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు