Ram Charan, Upasana: పిల్లల విషయంలో చరణ్- ఉపాసన ల షాకింగ్ డెసిషన్..!

సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అందులోనూ మనకు ఇష్టమైన నటీనటుల పర్సనల్ వ్యవహారాలు అన్నీ తెలుసుకోవాలి అనే కుతూహలం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. సోషల్ మీడియాలో చాలా మంది యాక్టివ్ గా ఉండేది కూడా అందుకే.! సరే ఇక అసలు విషయానికి వద్దాం. రాంచరణ్- ఉపాసన దంపతులకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ళు చేసే సోషల్ యాక్టివిటీస్ వల్ల.. అభిమానించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

అదే సమయంలో ఈ జంటని ట్రోల్ చేసేవారి సంఖ్య కూడా లేకపోలేదు. మొన్నటి వరకు ఈ జంట పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు పూర్తికావస్తున్నా.. ఇంకా పిల్లలను కనకపోవడంపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు చిరంజీవి ప్రకటించారు. దీంతో అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. ఉపాసన బేబీ బంప్ ఫోటోలు కూడా నెట్టింట్లో సందడి చేశాయి. ఇదిలా ఉంటే.. రాంచరణ్- ఉపాసన పిల్లల విషయంలో ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట.

అది తెలిస్తే అభిమానులు నిరాశ చెందే అవకాశం లేకపోలేదు. విషయం ఏంటి అంటే.. చరణ్ – ఉపాసన తమకు పుట్టబోయే పిల్లలను సినిమాలకు దూరంగా ఉంచి పెంచాలి అనుకుంటున్నారట. నిజానికి స్టార్ ఫ్యామిలీస్ తమ కిడ్స్ ను నెలల పిల్లలుగా ఉన్నప్పుడే తమ సినిమాల ద్వారా ప్రేక్షకులకు చూపించాలని ఆశపడుతుంటారు. తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కూడా లాంచ్ చేస్తారు. ఇక 20 ఏళ్ల వయసు వచ్చింది అంటే చాలు సినిమాల్లో హీరోని చేసెయ్యాలి అనుకుంటారు.

కానీ ఈ విషయంలో చరణ్ – ఉపాసన లు పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నారు అని సమాచారం. తమ పిల్లలను బాగా చదివించుకోవాలి అనే ఉద్దేశం ఉంటే పర్వాలేదు. కానీ చదువు పూర్తయ్యాక కూడా సినిమాలకు దూరంగా ఉంచాలి అనుకుంటే.. అది అభిమానులకు చేదు వార్త అనే చెప్పాలి. ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus