Ram Charan: చరణ్ జాకెట్ ఖరీదు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. స్టైలిష్ గా ఉండటానికి ఇష్టపడే చరణ్ ఒకవైపు సినిమా ఆఫర్లతో బిజీగా ఉంటూనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. శనివారం రోజున చరణ్ బిగ్ బాస్ షోకు డెనిమ్ జీన్స్ ధరించి ఎంట్రీ ఇచ్చారు.

చరణ్ ధరించిన జాకెట్ ధర గురించి తెలిసి అవాక్కవ్వడం నెటిజన్ల వంతవుతోంది. ఈ జాకెట్ ఖరీదు ఏకంగా 1,30,000 రూపాయలు కావడం గమనార్హం. కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే రామ్ చరణ్ తన రేంజ్ కు తగిన విధంగానే దుస్తుల కోసం ఖర్చు చేస్తున్నారని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చరణ్ నటించిన సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది.

మరోవైపు శంకర్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చరణ్ వచ్చే ఏడాది మూడు సినిమాలను విడుదల చేసి మూడు సినిమాలతో ఘన విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శంకర్ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా అంజలి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus