Ram Charan: ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఆస్కార్ లభించడం పై చరణ్,ఉపాసన ఎమోషనల్ కామెంట్స్ !

2023 మార్చి 13.. అనేది తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లికింపదగ్గ పేరు.ఎందుకంటే 90 ఏళ్ళ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అద్భుతం జరిగింది. 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’ పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డు లభించింది.నేషనల్ అవార్డులే రాక విలవిలలాడుతున్న సినీ పరిశ్రమ మనది. అలాంటిది ఆస్కార్ సాధించడం చిన్న విషయమా.? పైగా రిహానా వంటి హాలీవుడ్ పాపులర్ సింగ‌ర్స్ పాడిన పాట‌లు పోటీలో ఉన్నప్పటికీ వాట‌న్నింటినీ పక్కకు నెట్టి ‘నాటు నాటు’ ఆస్కార్ గెలవడం అంటే ఆషామాషీ విషయం కాదు.

ఈ పాటను ఎం.ఎం కీరవాణి తనయుడు కాలభైరవ అలాగే బిగ్ బాస్3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడారు.చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ అందించారు. రాంచరణ్ – ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళిందని చెప్పాలి. ఇక లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్.ఆర్.ఆర్’ టీంతో పాటు చరణ్ సతీమణి ఉపాసన కూడా పాల్గొంది.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఉపాసన మాట్లాడుతూ.. “నేను కూడా ఆర్.ఆర్.ఆర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.తర్వాత చరణ్ ‘తను 6వ నెల గర్భవతి. మా బిడ్డకు అప్పుడే గొప్ప ప్రేమ లభిస్తుంది. కడుపులో ఉండగానే మా బిడ్డ మాకు బోలెడంత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది’ అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus