Ram Charan: ఆర్ఆర్ఆర్ ఎంట్రీ సీన్ షూట్ అన్నిరోజులు జరిగిందా?

ఆర్ఆర్ఆర్ సినిమాకు హైలెట్ గా నిలిచిన సన్నివేశాలలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఒకటనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లో రామరాజు పాత్ర ఎలా ఉంటుందో ఈ ఒక్క సీన్ తో జక్కన్న ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. సాధారణంగా అలాంటి సన్నివేశాన్ని షూట్ చేయడం సులువైన విషయం కాదు. అయితే ఆ ఒక్క సీన్ షూటింగ్ కోసం ఏకంగా 32 రోజుల సమయం పట్టిందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

అన్ని భాషల్లో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని చరణ్, ఎన్టీఆర్ క్రేజ్ ఈ సినిమా ద్వారా ఊహించని స్థాయిలో పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జీ5 తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చరణ్ ఇంట్రో సీన్ విషయాన్ని వెల్లడించింది. ఆర్ఆర్ఆర్ లో చరణ్ ఇంట్రడక్షన్ మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్ అని జీ5 వెల్లడించింది. ఓటీటీలో ఆర్ఆర్ఆర్ అంచనాలకు అందని స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది. థియేటర్లలో ఒక్కసారి మాత్రమే చూసిన ప్రేక్షకులు ఓటీటీలో ఒకటి కంటే ఎక్కువసార్లు చూస్తూ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

రాజమౌళి సినిమా అంటే కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్నారు. రాజమౌళి మహేష్ కాంబో మూవీ షూట్ వచ్చే ఏడాది మొదలుకానుంది. కథ ఫైనల్ అయిన తర్వాత జక్కన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఎన్టీఆర్, చరణ్ భవిష్యత్తు సినిమాలకు ఊహించని స్థాయిలో అఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

చరణ్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్లు సైతం పెరిగాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చరణ్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తుండగా ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు హిందీలో కూడా రిలీజ్ కానుండగా ఈ సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే చరణ్, ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికీ పలు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫుల్ రన్ లో ఈ సినిమాకు 1140 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus