Ram Charan: క్షేమాపణలు చెప్పినా సునిశిత్ ..వైరల్ అవుతున్న వీడియో!

సోషల్ మీడియా ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ హీరోలపై , హీరోయిన్స్ పై ఇష్టమొచ్చిన అభియోగాలు వేస్తూ, పబ్బం గడుపుకున్న సునిశిత్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ బుద్ధి చెప్పారు. మహేష్ బాబు నా సినిమాలను దొబ్బేసాడు అంటూ, ఎన్టీఆర్ నాకు అన్యాయం చేశాడంటూ, లావణ్య త్రిపాఠి మరియు తమన్నా నా లవర్స్ అంటూ ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడిన సునిశిత్ ని మెంటలోడు అనుకోని అందరూ కొద్దిరోజులు పట్టించుకోవడం మానేశారు.

ఇతను చేసే వ్యాఖ్యలపై అభిమానులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం తో అరెస్ట్ కూడా చేసారు. మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇచ్చిన, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసినా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. దాంతో కొన్ని రోజులు ఆయన సోషల్ మీడియా లో కనపడలేదు. కానీ రీసెంట్ గా మళ్ళీ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఈ ఇంటర్వ్యూ లో సునిశిత్ రామ్ చరణ్ భార్య ఉపాసన నాకు ఎంతో క్లోజ్ అని, మేమిద్దరం గోవా లో ఒక ఎలక్ట్రిక్ కార్ లో లాంగ్ డ్రైవ్ కి కూడా వెళ్ళమని.

రామ్ చరణ్ (Ram Charan) కూడా మా ఇద్దరి చాట్ ని చూస్తూండేవాడని, ఆయన చూసి సరదాగా పడేయి రా ఆ అమ్మాయిని అని అన్నాడని, ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ ఆయన చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ని నేనే పెళ్లి చేసుకోవాల్సింది అని, కానీ కొన్ని కారణాల చేత చేసుకోలేకపోయాను అని కూడా చెప్పుకొచ్చాడు.

ఇవన్నీ విని ఆవేశం తో రగిలిపోయిన రామ్ చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ని ఇంటికి వెళ్లి చితక్కొట్టారు. అనంతరం ఒక వీడియో బైట్ ద్వారా ‘ నేను మొన్న ఉపాసన గారి మీద కొన్ని తప్పుడు కామెంట్స్ చేశాను. అందుకు క్షమాపణలు చెప్తున్నాను, మరోసారి ఇలాంటి కామెంట్స్ చెయ్యను’ అని చెప్పించారు. రామ్ చరణ్ అభిమానులు చేసిన ఈ మంచిపనికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.

 

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus