Dil Raju: గేమ్ ఛేంజర్ విషయంలో దిల్ రాజు పై మండిపడుతున్న చరణ్ ఫాన్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు నిర్మాత దిల్ రాజు పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలా నిర్మాతపై మండిపడటానికి కారణం లేకపోలేదు చరణ్ నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా నుంచి ఇప్పటివరకు సరైన అప్డేట్ లేకపోవడంతో చరణ్ ఫాన్స్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. చాలా శర వేగంగా ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అనుకోకుండా భారతీయుడు 2సినిమా తెరపైకి రావడంతో శంకర్ రెండు సినిమాలు షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

అయితే ఈయన ఎక్కువగా చరన్ సినిమా కన్నా కమల్ హాసన్ భారతీయుడు2 సినిమా పైన ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.ఇలా భారతీయుడు సినిమా పై ఫోకస్ చేసినటువంటి శంకర్ రామ్ చరణ్ సినిమాని మాత్రం తన అసిస్టెంట్లతో షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక రామ్ చరణ్ సైతం తన భార్య ఉపాసన డెలివరీ కావడంతో సినిమా షూటింగ్లకు కాస్త దూరంగా ఉంటున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ సినిమా ఆలస్యం అవ్వడమే కాకుండా ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విషయంలోఅసహనం వ్యక్తం చేసినటువంటి అభిమానులు సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ శంకర్ అలాగే నిర్మాత దిల్ రాజు పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

వేక్ అప్ శంకర్(నిద్ర లే) అంటూ దర్శకుడి మీద ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. (Dil Raju) దిల్ రాజుని అయితే దారుణంగా సిగ్గు లేదంటూ (#UselessDilRajuShamelessSVC) ఓ ట్యాగ్ వైరల్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ విడుదల చేయాలి అంటూ డిమాండ్స్ చేస్తున్నారు. మరి ఫాన్స్ డిమాండ్ పై మేకర్స్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus