Ram Charan: గౌతమ్ చరణ్ కోసం సిద్ధం చేసిన స్టోరీ లైన్ ఇదే!

చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఒక సినిమా ఆగిపోయిందనే వార్త ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. చరణ్ కు కథ నచ్చినా చిరంజీవికి ఆ కథ నచ్చకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా కోసం గౌతమ్ తిన్ననూరి సిద్ధం చేసిన స్టోరీ లైన్ మాత్రం అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
2050 తర్వాత మనుషుల జీవన విధానం ఏ విధానం ఏ విధంగా ఉండబోతుంది?

టెక్నాలజీ ఎంట్రీతో మనుషుల జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే విషయాలను కొత్తగా చూపిస్తూ గౌతమ్ ఈ సినిమాను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాను తెరకెక్కించాలంటే కనీసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమని సెట్స్ లోనే ఈ సినిమాను షూట్ చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. గౌతమ్ తిన్ననూరి మరో హీరోతో ఈ కథను సినిమాగా తెరకెక్కించాలని భావిస్తున్నా గౌతమ్ ను నమ్మి ఆ స్థాయిలో బడ్జెట్ ను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మిడిల్ రేంజ్ హీరోలతో సినిమాలను నిర్మించే నిర్మాతలు 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ ను కేటాయించలేరు. ప్రస్తుతానికి గౌతమ్ ఈ కథను పక్కన పెట్టేశారని సమాచారం అందుతోంది. గౌతమ్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. జెర్సీ హిందీ ఫ్లాప్ తో గౌతమ్ తిన్ననూరి రెమ్యునరేషన్ సైతం పెరిగిందని తెలుస్తోంది.

గౌతమ్ తిన్ననూరికి సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతోంది. ఒక వర్గం ప్రేక్షకుల్లో గౌతమ్ తిన్ననూరికి ఊహించని రేంజ్ లో అభిమానులు ఉన్నారు. భవిష్యత్తులో చరణ్ గౌతమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి. గౌతమ్ తిన్ననూరి తర్వాత ప్రాజెక్ట్ తో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus