టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా ప్రచారం చెయ్యాల్సిన పనిలేదు. అయితే అదే క్రమంలో మెగాస్టార్ అంటేనే సేవ దృక్పధంతో ముందుకు సాగిన వ్యక్తి అంటూ ఆయన అభిమానులు ఆయన్ని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. అయితే ఎన్ని విమర్శలు ఎదురైనా మెగాస్టార్ నేత్రదానం…రక్తదానం అంటూ సోషియల్ సర్విస్ చేశాడు అన్న మాట వాస్తవం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే అలాంటి తండ్రికి అలాంటి కొడుకే పుట్టాడు అని ఇప్పుడు ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. విషయంలోకి వెళితే…మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ ఒక మూడు ఏళ్ళ బాలుడి ప్రాణాలు కాపాడి ఒక పేద కుటుంబంలో సంతోషాన్ని నింపి వారికి దేవుడుగా మారిన సంఘటన ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. అసలు విషయం ఏంటి అంటే…రామ్ చరణ్ రాజమండ్రి చుట్టుపక్కల లంక గ్రామాలలో తన ‘రంగంస్థలం 1985’ షూటింగ్ కోసం తెగ కష్టపడుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన ధనుష్ అనే మూడేళ్ల బాలుడు మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్నాడు గత ఏప్రియల్ నెలలోచరణ్ ఈ షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చినప్పుడు ధనుష్ తల్లి తండ్రులు చరణ్ కలిసి తమ కష్టాలను వివరించారు.
దీనితో వారి కష్టాలకు చెలించిపోయిన చరణ్ తన సొంత ఖర్చుతో హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో ఆ అబ్బాయి వైద్యానికి అవసరమైన ఏర్పాట్లు చేసాడు. ఇప్పడు ఆ అబ్బాయికి చికిత్స పూర్తి అయి తిరిగి పూర్తిగా కోలుకున్న నేపధ్యం లో ధనుష్ తల్లి తండ్రులు ఈ మధ్య చరణ్ ను తిరిగి తన ‘రంగస్థలం 1985′ షూటింగ్ కోసం రాజమహేంద్రవరం పరిసర గ్రామాలకు వచ్చినప్పుడు చరణ్ ను కలిసి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మొత్తంగా తండ్రికి తగ్గ తనయుడిగా చెర్రీ మంచి పేరు సంపాదించుకుంటున్నాడు అనే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.