బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు, దర్శకులు,నిర్మాతలు అంతా ఒక్క హిట్టు కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. ఆడియన్స్ ని ఎలా థియేటర్స్ కి రప్పించి.. వాళ్ళని మెప్పించాలో అర్థం కాక అంతా సౌత్ వైపు చూస్తున్నారు. టాలీవుడ్ హీరోలకే ఎక్కువగా పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. కాబట్టి తెలుగు దర్శకులను గట్టిగా లిఫ్ట్ చేసి మార్కెట్ పెంచుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. కానీ మన వాళ్లకి బాలీవుడ్ పై మోజు కలుగుతుంది. ఇండియన్ సినిమాలో భాగంగా బాలీవుడ్ మార్కెట్ పెద్దది. అందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ అక్కడి ఆడియన్స్ ని మెప్పించడానికి అక్కడి ఫిలిం మేకర్స్ తోనే సినిమాలు చేయనవసరం లేదు. ఈ విషయం మన స్టార్ హీరోలకి అర్థం కాకో లేక పారితోషికానికి టెంప్ట్ అయ్యో కానీ బాలీవుడ్ మేకర్స్ తో సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటున్నారు. ‘ఆదిపురుష్’ తో ప్రభాస్, ‘వార్ 2’ తో ఎన్టీఆర్, ‘ఛత్రపతి’ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలానే ఉంది. రామ్ చరణ్ కూడా ‘జంజీర్’ తో ఎక్స్పీరియన్స్ చేశాడు. అయినప్పటికీ ఇప్పుడు అతను ‘ధూమ్ 4’లో నటించడానికి అంగీకరించినట్టు టాక్ నడుస్తుంది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించే ఈ సినిమాని యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుందట.’ధూమ్ 4′ లో రణబీర్ కపూర్ మెయిన్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. చరణ్ ను మరో హీరోగా పెట్టి.. ఈ భారీ సీక్వెల్ ను చేయాలనేది ఆదిత్య చోప్రా అండ్ టీం ప్లాన్ గా తెలుస్తుంది. కానీ మరో ఆర్.ఆర్.ఆర్ హీరో ఎన్టీఆర్ పరిస్థితి చూశాక.. రామ్ చరణ్ ‘ధూమ్ 4’ తో రిస్క్ చేస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.