Ram Charan: ఫ్యాన్స్‌కి భలే కిక్కిచ్చే న్యూస్‌! లేదు లేదంటూనే రామ్‌చరణ్‌ ఆ లోకంలోకి వెళ్తున్నాడా?

సింహం కామ్‌గా ఉంది కదా అని వేట మానేసిందనో, వేట రాదనో కాదు.. టైమ్‌ వచ్చినప్పుడు దాని పంజా పవర్‌ చూపిస్తుంది అంటారు. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు రామ్‌చరణ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి పాన్‌ ఇండియా ఇమేజ్‌ తర్వాత చరణ్‌ ఆ క్రేజ్‌ను ఇంకా వాడుకోవడం లేదు. పెద్ద పెద్ద పాన్‌ ఇండియా సినిమాలు చేయడం లేదు అని ఫ్యాన్స్ కాస్త బాధలో ఉన్నారు. అయితే ఆ బాధను రెండు యూనివర్స్‌లతో మటుమాయం చేసే పనిలో ఉన్నాడు చరణ్‌.

క్లారిటీ వచ్చినా, క్లారిటీ రానట్లు ఉంది కదా ఈ విషయం. మాకు కూడా ఇలాగే ఉంది సమాచారం. అయితే కోలీవుడ్‌, శాండిల్‌ వుడ్‌ ఫైనల్‌గా టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం అయితే… చాలా క్లారిటీ వస్తోంది. చరణ్‌ గారాలపట్టి ‘క్లీంకారా’ బారసాల కార్యక్రమం ఇటీవల పూర్తవ్వడంతో ఇప్పుడు సినిమాల మీద దృష్టిపెట్టాడు. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కొత్త షెడ్యూల్‌ త్వరలో మొదలవుతుంది. ఈ లోపు కొత్త ప్రాజెక్టులు ఓకే చేసే పనిలో ఉన్నాడని టాక్‌.

ఈ మేరకు ఇటీవల లోకేశ్‌ కనగరాజ్‌ – రామ్‌చరణ్‌ (Ram Charan) మధ్య భేటీ జరిగిందట. ఆ భేటీ వెనుక కథ ‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ ఎంట్రీ ఉంది అని అంటున్నారు. లోకేశ్‌ సినిమాల సిరీస్‌ అయిన ఎల్‌సీయూలో చరణ్‌ ఓ సినిమా చేయబోతున్నాడట. దానికి లీడ్‌ విజయ్‌ ‘లియో’ సినిమాలో ఉంటుందని సమాచారం. ఈ మేరకు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి ఆ సినిమాలో టీజ్‌ చేస్తారు అని చెబుతున్నారు. ‘విక్రమ్‌’లో సూర్య రోలెక్స్‌ పాత్ర తరహాలో ఉంటుంది అంటున్నారు. ఇది ఒక్కటే కాదు వార్త.

ఇంకో వార్త కూడా ఉంది. అదే చరణ్‌ ‘ప్రశాంత్‌ నీల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో కూడా పార్ట్‌ అవ్వబోతున్నాడట. ‘సలార్‌’ సినిమా ద్వారా ఈ విషయం కూడా బయటకు వస్తుంది అంటున్నారు. ప్రశాంత్‌ – చరణ్‌ మీటింగ్‌లో ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చిందట. సో ఫ్యాన్స్‌కి డబుల్‌ కిక్‌ ఇవ్వనున్నాడు చరణ్‌.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus