‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ఎన్టీఆర్,చరణ్ ల అగ్రిమెంట్ ఎన్ని రోజులో తెలుసా..?

జూ.ఎన్టీఆర్ – రాం చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక రెండవ షెడ్యూల్ జనవరి 21న హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో జూ.ఎన్టీఆర్’ రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడట.

దీని కోసం ఎన్టీఆర్‌ తన బాడీ షేప్ ను కూడా మార్చాడట. ఇక మరో హీరో అయిన రాంచరణ్ కూడాకొత్త హెయిర్ స్టైల్ తో దర్శనమివ్వనున్నాడని తెలుస్తోంది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం దర్శకుడు రాజమౌళి ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరిని జస్ట్ 10 నెలల డేట్స్ మాత్రమే కోరాడట. అంటే ఒక సంవత్సరం లోపే అన్న మాట. ఇక ఈ వన్ ఇయర్ మరో సినిమా చేయకూడదన్నది అగ్రిమెంట్. ఇందుకోసం ఎన్.టి.ఆర్, చరణ్ లు హ్యాపీగానే రాజమౌళి అడిగిన 10 నెలలు టైంకు ఓకే చెప్పేశారట. గతంలో మాదిరికాకుండా రాజమౌళి ఈసారి పర్ఫెక్ట్ టైంలో షెడ్యూల్ ను పూర్తిచేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి…! ఇక ఈ చిత్రానికి అన్ని భాషలు కలుపుకుని 350 కోట్ల వరకు డిమాండ్ ఉంటుందని, అలాగే శాటిలైట్, డిజిటల్ రైట్స్ మరో 150 కోట్లు వచ్చే అవకాశాలు ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై అగ్ర నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus