ప‌వ‌న్ కోసం.. ఏం ప్లాన్ వేశావు చ‌ర‌ణ్..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక‌వైపు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నా, మ‌రోవైపు సినిమాల పై కూడా ఫోక‌స్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌ర‌సుగా సినిమాలు లైన్‌లో పెట్టిన ప‌వ‌న్ మ‌రోసినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌నే టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తుంది. ముందుగా వ‌కీల్ సాబ్ షూటింగ్‌లో పాల్గొంటున్న ప‌వ‌న్, ఆ త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా షూటింగ్‌లోకి ఎంట‌ర్ అవుతాడు. ఇక ఆ త‌ర్వాత హారీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా, సాగ‌ర్ కె చంద్ర ద‌ర్వ‌క‌త్వంలో మ‌రో సినిమా, సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో ఇంకో సినిమా చేసేందుకు ప‌వ‌న్ ఇప్ప‌టికే ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజా మ్యాట‌ర్ ఏంటంటే ప‌వ‌న్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌గా త‌న తొలి సినిమాను ప‌వ‌న్‌తో చేయ‌నున్నాడ‌నే వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. డ్యాన్స్ మాస్ట‌ర్‌గా త‌నేంటో ఇప్ప‌టికే నిరూపించుకున్న జానీ డైరెక్ట‌ర్‌గా ప్రూవ్ చేసుకోవాల‌ని ఎప్పటినుండో ప్ర‌య‌త్నిస్తున్నాడు. రెండు మూడు క‌థ‌ల‌ను కూడా సిద్ధం చేసుకున్నాడ‌ట‌. ఇండ‌స్ట్రీలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో జానీ మాస్ట‌ర్‌కు మంచి రిలేష‌న్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ ఒక‌వైపు హీరోగా న‌టిస్తూనే, మ‌రోవైపు సినిమాలు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో జానీ వినిపించిన క‌థ‌ చెర్రికి అద్భుతంగా అనిపించ‌డంలో తానే నిర్మిస్తాన‌ని హామీ ఇచ్చాడ‌ని స‌మాచారం.

ఇక ఆ స్క్రిప్ట్‌ను బాబాయి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్ళ‌డం.. జానీ చెప్పిన పాయింట్ కొత్త‌గా ఉండ‌డంతో, ఫుల్ స్కిప్ట్‌ను రెడీ చేయ‌మ‌ని సినిమా చేద్దామ‌ని జానీ మాస్ట‌ర్‌కు ప‌వ‌న్ ఓకే చెప్పేశార‌ని టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే తండ్రితో వ‌రుస‌బెట్టి సినిమాలు నిర్మిస్తున్న చ‌ర‌ణ్, బాబాయ్ ప‌వ‌న్‌తో కూడా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు జానీ చెప్పిన స్టోరీ ప‌వ‌ర్ ప్యాక్‌డ్‌గా ఉండ‌డంతో, బాబాయ్‌కి అయితే క‌రెక్ట్‌గా సెటె అవుతుందని ఈ ప్ర‌జెక్ట్‌ను సెట్ చేశాడ‌ట‌. మ‌రి ఈ వార్త‌లో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కానీ బాబాయ్ కోసం చెర్రి భ‌లే ప్లాన్ వేశాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus