ధృవ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న “రంగస్థలం 1985 ” మొదటి నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో చెర్రీ గుబురు గడ్డంతో గ్రామీణ కుర్రోడిగా నటిస్తుండడం, కథ పాతికేళ్ల కాలంలో జరిగేది కావడంతో ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడో మరో విషయం చిత్రానికి మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది. అదే చరణ్ పాత్ర పేరు. ‘అభిమన్యు నారాయణ’ రంగస్థల కథానాయకుడు అనే పేరు చెర్రీ క్యారక్టర్ కి పెట్టినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. సెట్ లోని ఫోటో కూడా బయటికి వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
గతవారం వరకు రాజమహేంద్రవరం పరిసరాల్లో జరిగిన షెడ్యూల్ తో దాదాపు 40 శాతం టాకీ పార్ట్ తో పాటు రెండు పాటలు పూర్తి అయ్యాయి. నెక్స్ట్ వారం నుంచి హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో నాలుగో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఇందులో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తుండగా, అనసూయ మరదలిగా చరణ్ ని ఆటపట్టించనుంది. సీనియర్ హీరో జగపతి బాబు, యువ నటుడు అది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.