Nayak Re-release: రామ్ చరణ్ మూవీ ఆ తేదీన రీరిలీజ్.. భారీస్థాయిలో కలెక్షన్లు వస్తాయా?

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. రీరిలీజ్ సినిమాల రిజల్ట్ తో కూడా సంబంధం లేకుండా ఆ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న రామ్ చరణ్ (Ram-Charan) నటించిన నాయక్ (Naayak) మూవీ ఈ నెల 27వ తేదీన రీరిలీజ్ కానుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రీరిలీజ్ కానుండటం గమనార్హం. ఈ సినిమాకు రీరిలీజ్ లో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నాయక్ మూవీ 2013 సంవత్సరం జనవరి నెల 9వ తేదీన రిలీజై అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. నాయక్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించగా (Kajal) కాజల్, (Amala Paul) అమలాపాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game-Changer) సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

మార్చి నెల 27వ తేదీన ఈ సినిమా నుంచి జరగండి జరగండి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి కూడా ఆరోజే స్పష్టత రానుందని సమచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాదే క్రిస్మస్ పండుగ కానుకగా రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ షూట్ కూడా త్వరలో మొదలుకానుందని తెలుస్తోంది.

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు ఆర్.ఆర్.ఆర్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కొన్ని రోజుల క్రితం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు చరణ్ హాజరైన సమయంలో బాలీవుడ్ ఫ్యాన్స్ జై శ్రీరామ్ అంటూ కామెంట్లు చేయడం జరిగింది. చరణ్ ఇతర భాషల ప్రేక్షకులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus