Ram Charan, Prasanth Neel: ప్రశాంత్‌ నీల్‌ – రామ్‌చరణ్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ రూమర్‌!

ప్రశాంత్‌ నీల్‌… ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌కేక్‌. ఇప్పుడేంటి… ‘కేజీఎఫ్‌’ ట్రైలర్‌ వచ్చినప్పటి నుండి అని చెప్పొచ్చు. ‘కేజీఎఫ్‌ 2’ చిత్రీకరణ పూర్తయిన వెంటనే మన నిర్మాతలు ఆయనకు అడ్వాన్స్‌లు ఇచ్చే పని పెట్టుకున్నారు. హీరోలు అయితే కథలు విని ఓకే చేసేసి, లాక్‌ చేసేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌ ‘సలార్‌’ మొదలైంది. త్వరలో విడుదల చేస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌తో సినిమాలుంటాయని సమాచారం. ఇందులో ఏ హీరో సినిమా ముందు మొదలవుతుంది అనే విషయంలో ఇటీవల ఎన్టీఆర్‌ ప్రకటనలో క్లారిటీ వచ్చింది.

కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ సినిమా అని తారక్‌ చెప్పేశాడు. దీంతో అల్లు అర్జున్‌, రామ్‌చరణ్ కొన్ని రోజులు వెయిట్‌ చేయాలి. అయితే ఈ లోపు కథ విషయంలో ఇద్దరూ లెక్కలు తేల్చేస్తారు అని తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌… రామ్‌చరణ్‌తోనే చేస్తాడట. అంతేకాదు ఈ కాంబో ఒక్క సినిమాకే పరిమితం కాకుండా… ఓ సిరీస్‌లా ఉంటుందట. అంటే మరో ‘కేజీఎఫ్‌’ తరహా ఫ్రాంచైజీ అనుకోవచ్చు.

తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు అంటే ఇప్పుడు ‘ఎఫ్’ ఒకటే కనిపిస్తోంది. ‘ఎఫ్‌ 2’ తర్వాత ఇప్పుడు ‘ఎఫ్ 3’ సిద్ధమవుతోంది. ఒకవేళ చరణ్‌ – ప్రశాంత్‌ ఫ్రాంచైజీ మొదలుపెడితే… ఇలాంటివి ఇంకొన్ని సినిమాలు సిద్ధమవుతాయి. ఇండస్ట్రీకి ఇది కొత్త ఊపు తీసుకొచ్చే అవకాశం ఉంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus