Ram Charan: వాల్తేరు వీరయ్య సాంగ్ గురించి చరణ్ అలా అన్నారా?

చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కు మరో 50 రోజుల సమయం మాత్రమే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమా నుంచి బాస్ పార్టీ పేరుతో ఒక సాంగ్ రిలీజ్ కాగా కేవలం 24 గంటల్లో ఈ సాంగ్ కు 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

సాంగ్ ప్రోమోపై నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సాంగ్ కు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రామ్ చరణ్ ఈ సాంగ్ గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఈ సాంగ్ గురించి పోస్ట్ చేస్తూ బాస్ మళ్లీ స్ట్రాంగెస్ట్ జోన్ లోకి వచ్చేశారని ఈ సాంగ్ ఫ్రెష్ అండ్ సూపర్ గా అదిరింది అంటూ చెప్పుకొచ్చారు. సూపర్ ఫ్రెష్, మాస్ సాంగ్ అని ఈ సాంగ్ గురించి చరణ్ అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ కామెంట్లను చూసిన మెగా అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. చరణ్ కామెంట్లతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శంకర్ మూవీకి సంబంధించి కూడా చరణ్ ఏదైనా అప్ డేట్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దిల్ రాజు, చరణ్ ఈ దిశగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వారానికి ఒక సాంగ్ చొప్పున రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. వాల్తేరు వీరయ్య చిరంజీవి సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో అధికారక ప్రకటన రానుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus