మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా టీజర్ వచ్చినప్పటి నుంచీ మెగాఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చిరంజీవిని సిల్వర్ స్క్రీన్ పైన చూస్తామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మే 13వ తేదిన ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ కాబోతోంది. అంతేకాదు, ఈ సినిమా పక్కా కమర్షియల్ సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాలో కీలకమైన రోల్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ చేస్తోంది. ఇక ఈసినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుస్తున్నాయి. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దిరిపోతుందని , ఇదే సినిమాకి హైలెట్ గా ఉండబోతోందని టాక్.
ఇక సిద్ధ క్యారెక్టర్ కూడా అప్పుడే పరిచయం అవుతుందని చెప్తున్నారు. అంతేకాదు, సిద్ధ ఆచార్యని సేవ్ చేయాడనికి వస్తాడని, సిద్ధ స్టోరీ సెకండ్ హాఫ్ లో 20నిమిషాల పాటు ఉంటుందని అంటున్నారు. ఈ సిద్ధ క్యారెక్టర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సినిమా చూసేందుకు రీపీటెడ్ గా సిద్ధ కోసమే ఆడియన్స్ వచ్చేలా ఈ క్యారెక్టర్ ఉంటుదట. ముఖ్యంగా సిద్ధ స్టోరీ అయిపోయిన తర్వాత మళ్లీ ఆచార్య శక్తిని పుంజుకుని విలన్స్ పై పోరాడతాడని టాక్.
ఇక్కడే ఆచార్య ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా హైలెట్ గా ఉంటాయని చెప్తున్నారు. సినిమాలో సాంగ్స్, మెగాస్టార్ డ్యాన్స్, ఫైటింగ్స్ హైలెట్ గా ఉండబోతున్నాయని అంటున్నారు. మణిశర్మ ఇచ్చే ఆల్బమ్ కూడా సినిమాకి హైలెట్ గా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. లూసిఫర్, వేదాళం సినిమాల రీమేక్స్ అలాగే బాబీ తో మరో సినిమా, ఇకా మరో ఇద్దరు డైరెక్టర్స్ ని కూడా లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది.