రామ్ చరణ్ అన్న సందర్భం సరైనది కాకపోవచ్చు కానీ.. విషయం మాత్రం అక్షరాలా నిజం. ఎందుకంటే.. చాలామంది స్టార్ హీరోలు తమ వద్దకు వచ్చిన అద్భుతమైన కథలను, కాన్సెప్ట్ లను కేవలం “అభిమానులు యాక్సెప్ట్ చేయరేమో” అన్న భయంతోనే వదిలేసుకొంటున్నారు. ఈ ఇమేజ్ చట్రంలో పడి కెరీర్ లు డ్యామేజ్ చేసుకొంటున్న హీరోలు కోకొల్లలు. మొన్నటివరకూ చరణ్ కూడా ఆ ఇమేజ్ చట్రంలో కూరుకుపోయి నానా ఇబ్బందులుపడ్డాడు. “రంగస్థలం” సినిమాలో చెవిటివాడిగా నటించాలని అని సుకుమార్ చెప్పినప్పుడు మాత్రం కథ నచ్చడం, పెల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఫిలిమ్ అవ్వడంతో “ఫ్యాన్స్ ఏం అనుకుంటారు” అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా “రంగస్థలం” సినిమాలో యాక్ట్ చేశాను.
ఒకవేళ ఫ్యాన్స్ ఏమనుకుంటారు అని ఆలోచించి ఉంటే “రంగస్థలం” లాంటి హిట్ వచ్చేది కాదు అని రామ్ చరణ్ నిన్న జరిగిన “రంగస్థలం థ్యాంక్యూ మీట్”లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నిజమే చరణ్ మాట్లాడిన మాటల్లో తప్పేముంది. ఎంతసేపు ఫ్యాన్స్, ఫీలింగ్స్ అని పట్టించుకొంటే మంచి సినిమాలు రావు, ప్రయోగాలు చేయలేరు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ కూడా కాస్త అర్ధం చేసుకొని మిలగాలని కోరుకోవడం తప్ప ఎవ్వరం ఏమీ చేయలేం.