చరణ్ శంకర్ కాంబో మూవీ 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. నిర్మాత దిల్ రాజు సైతం ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాకు సీఈవో అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. చరణ్ శంకర్ సినిమాలో రెండు రోల్స్ లో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.
శ్రీకాంత్, ఎస్.జే.సూర్య ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ చరణ్ కు వెన్నుపోటు పొడిచే పాత్రలో కనిపిస్తారని సమాచారం అందుతోంది. శ్రీకాంత్ రోల్ ఈ సినిమాకు హైలెట్ అయ్యే విధంగా ఉంటుందని తెలుస్తోంది. చరణ్ సైతం ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు జీ స్టూడియోస్ కు సొంతమని సమాచారం అందుతోంది.
దిల్ రాజు, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో భారీ లాభాలు ఖాయమని దిల్ రాజు భావిస్తున్నారని బోగట్టా. రామ్ చరణ్ భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో ఈ సినిమా విషయంలో దిల్ రాజుకు వడ్డీల భారం పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వరుస విజయాల నేపథ్యంలో దిల్ రాజు తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కూడా భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.