టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. చరణ్ గత సినిమా వినయ విధేయ రామ ఫ్లాప్ అయినా చరణ్ నటించిన ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాల షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది చరణ్ నటించిన రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
చరణ్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని కొన్నిరోజుల క్రితం చరణ్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా చరణ్ రౌడీ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ఆర్ఆర్ఆర్ వాయిదా గురించి చరణ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాకపోయినా బాధ లేదని అన్నారు. సరైన సమయంలోనే ఆర్ఆర్ఆర్ రిలీజవుతుందని చరణ్ చెప్పుకొచ్చారు.
ఆర్ఆర్ఆర్ మూవీ కొరకు మూడున్నర సంవత్సరాలు ఎంతో శ్రమించామని నిర్మాత దానయ్య, దర్శకుడు రాజమౌళి ఆ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తారని చరణ్ అన్నారు. చరణ్ సైతం ఆర్ఆర్ఆర్ ఎప్పుడు రిలీజవుతుందో చెప్పలేకపోవడంతో ఏప్రిల్ లేదా జులైలో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. థియేటర్లలో ఆంక్షలు అమలు కాని పక్షంలో ఆర్ఆర్ఆర్ మూవీ గత వారమే రిలీజై ఉండేది. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజవుతాయని భావించిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది.
సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో బంగార్రాజు సినిమా మాత్రమే పెద్ద సినిమా కాగా రౌడీ బాయ్స్ సినిమాకు దిల్ రాజు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నా ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు సంక్రాంతి కానుకగా హీరో, సూపర్ మచ్చి సినిమాలు రిలీజవుతున్నాయి. 2022 సంక్రాంతి విజేత ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.