Ram Charan: ఆచార్య, ఆర్ఆర్ఆర్ సీక్రెట్స్ చెప్పేసిన చరణ్!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత బారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాను థియేటర్లలో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కానుంది. మెగా హీరో చరణ్, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. అభిమానులు ఓపికతో ఈ సినిమా కొరకు ఎదురు చూస్తుండటం గమనార్హం. తాజాగా బిగ్ బాస్ షోకు డిస్నీ + హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా వచ్చిన చరణ్, ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నానని షూట్ చేసిన సాంగ్ చూపించమని అడిగినా కీరవాణి భార్య వల్లి, కార్తికేయ చూపించడం లేదని చరణ్ చెప్పుకొచ్చారు. పరోక్షంగా రాజమౌళి ఆర్డర్స్ వల్ల హీరో అయిన తనకు కూడా పాటలను చూపించడం లేదని చరణ్ వెల్లడించారు. నాగార్జున నవ్వుతూ చరణ్ కు చూపించకపోయినా తనకు అయినా చూపించాలని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా వల్లి వ్యవహరిస్తుండగా కార్తికేయ ఎడిటింగ్ పనులను చూసుకుంటున్నారని సమాచారం.

సినిమా నుంచి అనధికారికంగా ఏ విషయం లీక్ కాకూడదని రాజమౌళి భావిస్తున్నారు. ఆచార్య సినిమాలో నాన్నతో కలిసి నటించడం కొత్త అనుభూతి అని ఇంట్లో ఉంటే అంత క్లోజ్ గా ఉండమని చరణ్ చెప్పుకొచ్చారు. సాయితేజ్ కోలుకుంటున్నాడని సాయితేజ్ ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని చరణ్ వెల్లడించారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus