మెగా పవర్ స్టార్ రాంచరణ్ అతి త్వరలో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ మరియు పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వం వహించగా.. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ చిత్రం చేస్తూనే మరోపక్క ‘ఆచార్య’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించాడు రాంచరణ్. ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ లో చరణ్ ఎక్కువ భాగం కనిపిస్తాడని స్వయంగా అతనే తెలియజేసాడు.
‘ఆచార్య’ లో చరణ్ 45నిమిషాల నిడివి గల పాత్రని పోషించాడు. అయితే ఈ ఒక్క పాత్ర కోసమే అతను ఏకంగా రూ.30 కోట్ల పారితోషికం అందుకున్నట్టు భోగట్టా. అయితే ఎటువంటి అడ్వాన్స్ తీసుకోలేదు. నిర్మాణ భాగస్వామి కూడా కాబట్టి.. ఆ మొత్తాన్ని లాభాల్లో వాటాగా తీసుకునే అవకాశం ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ కు చరణ్ ఎంత పారితోషికం తీసుకున్నాడు అనే విషయం పై క్లారిటీ లేదు. కానీ చరణ్… తన తర్వాతి సినిమా కోసం ఏకంగా రూ.100కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడట.
శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా బైలింగ్యువల్ మూవీగా రూపొందుతోంది. ఇక ఈ భారీ ప్రాజెక్టు కోసం చరణ్ ఏకంగా రూ.100కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నాడని భోగట్టా. ఇది కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ లో కొంత భాగం అలాగే నైజాం ఏరియాకి గాను దిల్ రాజుకి అందే దాంట్లో కొంత భాగం కలిపి ఉంటుందని భోగట్టా.
ఇదిలా ఉండగా.. దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో రూపొందిస్తున్న చిత్రానికి కూడా అతనికి రూ.100 కోట్లు పారితోషికం ఆఫర్ చేసినట్టు వినికిడి. వంశీ పైడిపల్లి ఆ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!