టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) గత రెండు సంవత్సరాలుగా గేమ్ ఛేంజర్ (Game changer) సినిమాకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ 20 శాతం పెండింగ్ లో ఉందని ఈ సినిమా మేకర్స్ సరైన రిలీజ్ డేట్ కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని అభిమానులకు తెలుసు. కఠినమైన డ్యాన్స్ స్టెప్స్ ను సైతం చరణ్ అలవోకగా చేస్తారు. అయితే రామ్ చరణ్ పాటలు పాడతారని మాత్రం అభిమానులకు తెలియదు.
చిరంజీవి (Chiranjeevi) 15 సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో మణిశర్మ (Mani Sharma) మ్యూజిక్ డైరెక్షన్ లో చరణ్ ఒక పాటను పాడారు. రాజా విక్రమార్క సినిమాలోని సాంగ్ ను ప్రజారాజ్యం కోసం రీమిక్స్ చేయగా ఆ పాటను రామ్ చరణ్ పాడటం జరిగింది. రామ్ చరణ్ పాడిన పాట వింటే గూస్ బంప్స్ వస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి కోసం రామ్ చరణ్ సింగర్ గా కూడా మారాడని చరణ్ వాయిస్ తో ఈ సాంగ్ ఎంతో బాగుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
భవిష్యత్తులో రామ్ చరణ్ తన సినిమాలలో సైతం పాటలు పాడతారేమో చూడాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది హీరోలు పాటలు పాడి తమ సింగింగ్ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. రామ్ చరణ్ ఇకపై మరింత వేగంగా సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2025 నుంచి ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా చరణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిమానులు చెబుతున్నారు.
రామ్ చరణ్ తన సినీ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ పారితోషికం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఇతర హీరోలతో పోల్చి చూస్తే రామ్ చరణ్ పారితోషికం తక్కువేనని తెలుస్తోంది. చరణ్ సినిమాలో వరుసగా బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తుండటం కొసమెరుపు. నాన్నకు ప్రేమతో చరణ్ పాడిన పాటకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.