తెలంగాణ ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టినరోజు నేడు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోని పెద్ద ఎత్తున ఆయనకు తెలంగాణ పార్టీ ప్రముఖులు అభిమానులు సినీ సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ సైతం సినీ హీరోల పుట్టినరోజు శుభాకాంక్షలు విషెస్ తెలియజేయడం విశేషం.
ఇకపోతే నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న కేటీఆర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలుపుతూ నా ప్రియమైన సోదరుడు.. ప్రజా నాయకుడు ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాంచరణ్ ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ విధంగా రాంచరణ్ కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో.. ఈ పోస్ట్ పై కేటీఆర్ స్పందిస్తూ రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ థాంక్స్ బ్రదర్… ఆర్ఆర్ఆర్ సినిమాలో మీ నటన అద్భుతమని విన్నాను. అయితే త్వరలోనే వీలు చూసుకుని ఈ సినిమా చూస్తాను అంటూ రిప్లై ఇచ్చారు.ఈ క్రమంలోనే వీరిద్దరికీ సంబంధించిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబానికి కేటీఆర్ కుటుంబానికి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధంతోనే కేటీఆర్ మెగా కుటుంబంలో జరిగే సినిమా ఈవెంట్లకు ఫ్రీ రిలీజ్ వేడుకలకు హాజరవుతూ ఉంటారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేయడం గమనార్హం. ఇక పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.
Happy Birthday to my dearest brother and most hardworking leader @KTRTRS