టాలీవుడ్ కొద్దిరోజులుగా మీటింగ్ ల మీద మీటింగ్ లు.. ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న కొన్ని సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు, జనాలు థియేటర్లకు రాకపోవడం, ఓటీటీ లో సినిమాలు రిలీజ్ అవ్వడం వంటి విషయాల పై మాత్రమే కాకుండా.. హీరోల రెమ్యునరేషన్స్.. వంటి విషయాలపై కూడా వీరు చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా సమస్యలు అన్నీ పరిష్కారం అయ్యే వరకు షూటింగులు కూడా నిలిపివేయాలని డిసైడ్ అయ్యారు.
ఆల్రెడీ ఆగస్టు 1 నుండి షూటింగ్ లు నిలిపివేస్తున్నట్టు నిన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా హీరోల పారితోషికాలు తగ్గించుకోవాలనేది నిర్మాతల మెయిన్ ఉద్దేశంగా తెలుస్తుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి రాంచరణ్.. మొదటి అడుగు వేస్తున్నారు అని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాతల మీటింగులకు ఎక్కువగా హాజరవుతాడు. అతని నిర్మాణంలో ఇప్పుడు రాంచరణ్- శంకర్ ల సినిమా రూపొందుతుంది. అందుకే రాంచరణ్ వద్దకు ముందుగా ఈ సమస్య ని తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.
రాంచరణ్ ఈ విషయం పై స్పందించి టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఈ విషయం పై చర్చ జరుపుతాను అని చెప్పారట. టాలీవుడ్లో ఓ స్టార్ హీరో అయిన రాంచరణ్.. ప్రతీస్టార్ హీరోతోనూ క్లోజ్ గా మూవ్ అవుతాడు. కాబట్టి రాంచరణ్ నిర్మాతల ఇబ్బందులను కనుక స్టార్ హీరోలకు తెలియజేస్తే పాజిటివ్ రిజల్ట్ ఉంటుందని నిర్మాత దిల్ రాజు వంటి వారు భావిస్తున్నారు. మరి వారి ఆలోచన ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
అయితే పారితోషికం విషయంలో చరణ్ నిర్మాతలను ఇబ్బంది పెట్టడట. కాకపోతే షూటింగ్ కు లేట్ గా రావడం, 6 అవ్వకుండానే షూటింగ్ స్పాట్ నుండి ఇంటికి వెళ్లిపోవడం వంటివి చరణ్ చేస్తాడనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి కూడా దిల్ రాజు పరోక్షంగా చరణ్ తో డిస్కస్ చేసినట్టు కూడా సమాచారం.