టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ తక్కువ సినిమాల్లోనే నటించినా మూడు ఇండస్ట్రీ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన చరణ్ హాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ ఆస్తుల విలువ టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది హీరోల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం. సినిమాల ద్వారా చరణ్ భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారు. ఒక్కో సినిమాకు రామ్ చరణ్ కు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కుతోంది.
తండ్రి నుంచి వారసత్వంగా చరణ్ కు భారీ స్థాయిలోనే ఆస్తులు వచ్చాయని సమాచారం. చరణ్ మొత్తం ఆస్తుల విలువ 1370 కోట్ల రూపాయలు అని బోగట్టా. మన దేశంలో ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లిస్తున్న అతికొద్ది మంది హీరోలలో రామ్ చరణ్ ఒకరు. సొంతంగా చరణ్ కు ప్రైవేట్ జెట్ కూడా ఉండటం గమనార్హం. రామ్ చరణ్ దగ్గర ఖరీదైన కార్లు ఉండగా వాటి విలువ కోట్లలో ఉంటుందని బోగట్టా. జూబ్లీహిల్స్ లో చరణ్ కు ఖరీదైన భవంతి ఉండగా ఈ భవంతి విలువ భారీగానే ఉంటుందని తెలుస్తోంది.
25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి ఉంది. ముంబైలో రామ్ చరణ్ కు పెంట్ హౌస్ ఉందని సమాచారం. చరణ్ నెల సంపాదన కనీసం 3 కోట్ల రూపాయల నుంచి గరిష్టంగా పది కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుండగా 70 శాతం షూటింగ్ పూర్తైందని సమాచారం.
చరణ్ శంకర్ కాంబో మూవీలో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుచ్చిబాబు సినిమాను కూడా ఈ ఏడాదే మొదలుపెట్టాలని చరణ్ భావిస్తున్నారని తెలుస్తోంది. అతి త్వరలో చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి కీలక విషయాలు వెల్లడి కానున్నాయి.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్