టాలీవుడ్ లో చిరు సెకెండ్ ఇన్నింగ్స్ మరెవ్వరికీ లేని విధంగా ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సొంత బ్యానర్ లో అంతా సొంత వారి సహకారంతో తన 150వ సినిమాని షురూ చేసేసాడు చిరు. ఇదిలా ఉంటే ఒక పక్క చెర్రీ ఈ సినిమాను ఎలా అయిన హిట్ చెయ్యాలి అన్న కసితో సామ వేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాడు…ఇప్పటికీ సినిమా ప్రమోషన్ కోసం మీడియాలో పనిచేస్తున్న కొందరిని స్పెషల్ గా ఎంపిక చేసి మరీ సినిమాని ప్రమోట్ చేసేందుకు రెడీ చేస్తున్నాడు…అక్కడితో వదిలెయ్యకుండా…ఈ సినిమా కధ….కధనం తెలిసనది అయినా…అంతా తమిళంలో వచ్చినది అయినప్పటికీ…మన తెలుగు నేటివీటీకి తగ్గట్టు ఈ సినిమాను మార్పులు చేసేందుకు సైతం చెర్రీ చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ రచయితలుగా పనిచేస్తుండగా మరో రచయితను సైతం చెర్రీ ఈ కధలోనూ…కధనలోనూ జాయిన్ చేశాడు…ఇంతకీ ఆ రచయిత ఎవరంటే….చిరు శిభిరానికి చాలా సన్నిహితుడు…వినాయక్ కు బాగా కావలసిన వాడు….ఆకుల శివ….అన్ని రకాలుగాను వారికి తగ్గవాడు కావడంతో ఆకుల శివను సైతం సహాయ రచయితగా ఈ సినిమాలో పనిచేయించుకుంటున్నాడు నిర్మాత చరన్. వీళ్ళే కాకుండా…మాటల రచయిత సాయి మాధవ్ బుర్రాని చిరు సినిమాలో భాగం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో రైటర్ హుస్సెన్ షాని కూడా చిరు సినిమా కోసం పనిచేయిస్తున్నారట. సినిమాలో ఆలి, సునీల్, బ్రహ్మానందం కలిసి వచ్చే సీన్స్ బాగా రావాలనే ఉద్దేశంతో హుస్సెన్ షా చేత డైలాగ్స్ రాయిస్తున్నారట. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన హుస్సేన్ షా మీకు మీరే మాకు మేమే సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది. ఇలా ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా….తమిళ సినిమా కత్తి రీమేక్ గా వస్తున్నా తెలుగు నెటివిటీ కోసం ఇంతమంది దర్శకులతో, రచయితలతో పనిచేయిస్తున్నాడు చెర్రీ. మరి ఇంత హంగామా చేస్తున్న ఈ సినిమా రేపు థియేటర్స్ లో ఎలాంటి హంగామా సృష్టిస్తుందో చూడాలి.